అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త ఒకరికి అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని ఒక వీధికి భారతీయ అమెరికన్ సతీష్ మెహతానీ పేరు పెట్టారు. సంప్రదాయ భారతీయ వంటకాలు, సంస్కృతికి ప్రాచుర్యం కల్పించినందుకు, ఎడిసన్ నగర ఆర్థికాభివృద్ధికి పాటుపడినందుకుగానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది.