అమెరికాలో భారతీయ వైద్యుడి దారుణ హత్య..!!

Nri News
Ganesh|
FILE
అమెరికాలో భారతీయ వైద్యుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు వాజిందర్ తూర్ అనే 34 సంవత్సరాల ప్రవాస భారతీయ వైద్యుడు కాగా.. చైనాకు చెందిన అతని మాజీ సహచరుడు డాక్టర్ లిసాన్ వాంగ్ (44) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

చికాగోలోని న్యూ హావెన్ సబర్బ్ ప్రాంతంలోగల వాజిందర్ నివాసానికి వెలుపల డాక్టర్ లిసాన్ వాంగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరపటంతో.. వాజిందర్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇదే సందర్భంగా ఆరు నెలల గర్భవతి అయిన వాజిందర్ భార్యపై కూడా వాంగ్ కాల్పులకు పాల్పడటంతో ఆమె సురక్షితంగా తప్పించుకున్నారు.

వృత్తిపరమైన కారణాలే వాజిందర్ హత్యకు కారణమై ఉండవచ్చునని అమెరికా పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం వాజిందర్ ఇంటికి దగ్గర్లో గల ఓ ట్రాఫిక్ స్టాపింగ్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న డాక్టర్‌ను అదుపులోకి తీసుకోవటంతో, వాజిందర్ హత్య విషయాలు వెలుగుచూసినట్లు పోలీసులు చెబుతున్నారు.


దీనిపై మరింత చదవండి :