అమెరికాలో తెలుగు సంఘాలైన తానా, నాట్స్, చికాగో తెలుగు సంఘాల (సీటీఏ) వేడుకలతో చికాగోలోని ఫ్లోరిడాలో అచ్చతెలుగు వాతావరణం ప్రతిబింబిస్తోంది. ఈ మూడు సంఘాల వేడుకల్లో పాల్గొనేందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఇక్కడికి తరలివచ్చారు. సాంకేతిక వికాసం-సాంస్కృతిక విన్యాసం పేరుతో తానా జూలై 2, 3, 4 తేదీలలో ద్వైవార్షిక మహాసభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చికాగోలోని రోజ్మౌంట్ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున జరుగుతున్న ఈ వేడుకలు రెండవతేదీ సాయంత్రం ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి.