సమైక్యాంధ్ర ఉద్యమ నినాదం అమెరికాలోని ప్రవాస భారతీయుల్లోకి చొచ్చుకెళ్లింది. సమైక్యాంధ్రకు మద్ధతుగా కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాలలోని తెలుగువారు పలు కార్యక్రమాలను నిర్వహించి, సమైక్యాంధ్రే ప్రగతికి సంకేతం అంటూ ఎలుగెత్తి నినదించారు. కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల కారణంగా రాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితి తలెత్తటం దురదృష్టకరమని ఎన్నారైలు ఈ సందర్భంగా విమర్శించారు.