అలబామా గౌరవ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నారై

Ganesh|
అమెరికాలోని అలబామా రాష్ట్ర గౌరవ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా భారత సంతతికి చెందిన ఎస్ఎస్ రాజ్‌శేఖర్ నియమితులయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రమోషన్ మరియు ట్రేడ్‌లలో 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన రాజ్‌శేఖర్.. స్వయంగా రూపొందించి, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత వారంలో కొన్ని కార్యక్రమాలను ప్రజెంటేషన్ చేశారు.

రాజ్‌శేఖర్ నిర్వహించిన ఈ కార్యక్రమాల ప్రజెంటేషన్ అలబామా రాష్ట్ర గవర్నర్ జిమ్ ఫాల్సమ్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఫాల్సమ్, రాజ్‌శేఖర్‌ను ఆ రాష్ట్రానికి గౌరవ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ఈ సందర్భంగానే ఓ సర్టిఫికెట్‌ను ఆయనకు అందజేశారు.

ఇక రాజ్‌శేఖర్ ప్రదర్శించిన ఇదే ప్రజెంటేషన్ అలబామా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్‌నూ విశేషంగా ఆకర్షించింది. దీంతో సెప్టెంబర్‌లో వాషింగ్టన్‌లో నిర్వహించనున్న వ్యవసాయాధికారుల సదస్సులో పాల్గొని, ఆ నివేదికను వివరించాలని కమీషనర్ రాన్ స్పార్క్స్ రాజ్‌శేఖర్‌ను కోరారు.


దీనిపై మరింత చదవండి :