ప్రముఖ భారతీయ సంస్కృత స్కాలర్ వఘన్ పిలికాన్ ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆఫ్ పొయెట్రీ పదవికోసం మరో పదిమందితో పోటీపడుతున్నారు. మహా భారతంతోపాటు అనేక పురాణేతిహాసలపై వఘన్ పుస్తకాలు రచించారు. అలాగే అనేక సమకాలీన భారతీయ సమస్యలపై పలు చిత్రాలను నిర్మించిన ఈయన, ఆక్స్‌ఫర్డ్ పొయెట్రీ ప్రొఫెసర్ పదవికోసం రేసులో నిలిచారు.