ఆస్ట్రేలియాలోని వివిధ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు.. అక్కడి స్వైన్‌బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వైస్ ఛాన్స్‌లర్ జెఫ్రీ స్మార్ట్ పేర్కొన్నారు. తమ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు, వారి తల్లిదండ్రులు అడిగే సందేహాల నివృత్తి కోసం ఈ హెల్ప్‌లైన్ 24 గంటలపాటు ఉచితంగా సేవలను అందిస్తుందన్నారు.