భారతీయులపై యధేచ్చగా జాత్యహంకార దాడులకు తెగబడుతున్న ఆస్ట్రేలియాలో పార్రామసాలా పేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో వారం రోజులపాటు జరుగనున్న ఈ భారత్ ఉత్సవం కళలు, సంగీతం మేళవింపుగా కనువిందు చేయనుంది. అందుకే ఈ ఉత్సవానికి పార్రామసాలా అని పేరు పెట్టారు.