ఆసీస్‌లో మళ్లీ దాడులు.. శ్రీలంక-భారతీయ జంటపై దాడి..!

Racial Attacks
Ganesh|
FILE
ఆస్ట్రేలియాలో ఆసియా ప్రజలకు వ్యతిరేకంగా మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఓ జాతీయుడు, భారత జాతీయురాలైన అతని భార్యపై ఆసీస్ జాత్యంహకారులు దాడికి పాల్పడ్డారు. నరనరాన జాత్యహంకారం జీర్ణించుకుపోయిన 25 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన ఆసీస్ యువకుల గుంపు తప్పతాగి బాధితులపై దాడికి పాల్పడింది.

60 సంవత్సరాల శ్రీలంక జాతీయుడు రంజీత్ సహస్రనమన్, భారత జాతీయురాలైన అతని భార్య సహస్రనమన్‌లపై మెల్‌బోర్న్‌లోని కారామ్స్ డౌన్ సబర్బన్‌లోగల వారి సొంత ఇంట్లోనే దుండగులు దాడికి పాల్పడ్డారు. దుండగులు రెండున్నర గంటలపాటు రంజీత్ ఇంట్లో వీరంగం సృష్టించారు. అయితే రంజీత్ దుండగులకు ఎదురొడ్డి, చాలాసేపు గట్టిగా పెనుగులాడాడు. ఇక పోలీసులు పోలీసులు రంగ ప్రవేశం చేస్తారనంగా దుండగులు పరారయ్యారు.

గత 19 సంవత్సరాల కాలం నుంచి రంజీత్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. తన భార్యా ఇద్దరు పిల్లలతో జీవిస్తున్న రంజీత్‌పై యువకుల గుంపు ఉద్దేశ్యపూర్వకంగానే, జాత్యహంకార దాడికి పాల్పడింది. కాగా, ఈ దాడిలో తెల్ల యువకుల గుంపు తన ఇంటి వెనుకవైపు కంచెను ధ్వంసం చేసి, దాని ద్వారా ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడిందని ఆయన పోలీసులకు వెల్లడించారు.


దీనిపై మరింత చదవండి :