ఆస్ట్రేలియన్లకు "ఫిసా" కృతజ్ఞతలు

FILE
భారతీయులపై జరుగుతున్న జాతి వివక్ష దాడులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన ఆస్ట్రేలియన్లకు కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఫిసా) ప్రకటించింది. అలాగే, స్థానిక భారతీయ విద్యార్థులు కూడా తమకు మద్ధతిచ్చిన ఆస్ట్రేలియన్లకు ధన్యవాదాలు చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఫిసా వ్యవస్థాపకుడు గౌతమ్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ... ఆస్ట్రేలియన్లకు ధన్యవాదాలు తెలిపేందుకు శుక్రవారం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మిఠాయిలు పంచడంతో పాటు, భారతీయులకు మద్ధతిచ్చిన ఆస్ట్రేలియన్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ రూపొందించిన ఒక పత్రాన్ని కూడా అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Ganesh|
మెల్‌బోర్న్‌లో అత్యంత రద్దీగా ఉండే ఫ్లిండర్స్ స్ట్రీట్ స్టేషన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గౌతమ్ గుప్తా తెలియజేశారు. ఈ సందర్భంగా ఫిసా, ఇతర సంఘాల వలంటీర్లు "కంటికి కన్ను ప్రపంచం మొత్తాన్ని అంధకారంలోకి నెడుతుంది" అనే నినాదం ఉండే టీషర్టులను ధరించి హాజరవుతారని ఆయన చెప్పారు.


దీనిపై మరింత చదవండి :