ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులు ఏరోజుకారోజు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెల్‌బోర్న్‌లో ఒక భారతీయుడిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఒక బృందంగా ఏర్పడిన ఆస్ట్రేలియన్లు 22 సంవత్సరాల సిక్కు యువకుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆస్ట్రేలియన్లు సిక్కు యువకుడి తలపై ఉన్న టర్బన్‌ను పీకివేసి దాడి చేయటంతో బాధితుడి తలకు తీవ్రంగా గాయమయ్యింది.