ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి

Racial attacks
Ganesh|
FILE
అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఇటు భారత ప్రభుత్వం విద్యార్థులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నా.. జాత్యహంకార దాడులు మాత్రం ఆగటం లేదు. తాజాగా అమృత్ గోయల్ అనే 36 సంవత్సరాల విద్యార్థి కొంతమంది ఆస్ట్రేలియన్ల చేతిలో దాడికి గురయ్యాడు.

మెల్‌బోర్న్‌లోని లావెర్టన్ ప్రాంతంలో నివసిస్తున్న గోయల్‌ను.. అతని ఇంటి ఎదురుగానే ఆస్ట్రేలియన్లు దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో దుండగులు గోయల్ ఎడమకంటిపై బలంగా కొట్టడంతో అతను గాయాలపాలయ్యాడు. కాగా.. ఇతడిపై దాడికి పాల్పడ్డ గుంపులో ఓ కూడా ఉండటం గమనార్హం.

"ఆస్ట్రేలియన్ ఇండస్ట్రియల్ సిస్టమ్ ఇనిస్టిట్యూట్ ఆటోమోటివ్" యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. దాడి అనంతరం బాధితుడు మాట్లాడుతూ.. దుండగులు తనను స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని దారుణంగా దూషిస్తూ దాడికి పాల్పడ్డారని వాపోయాడు. దాడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోయల్ వివరించాడు.


దీనిపై మరింత చదవండి :