ఆస్ట్రేలియాలో భారతీయులపై జాత్యహంకార దాడుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఎం.కె. ఆలీఖాన్ అనే విద్యార్థిపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆలీఖాన్కు కంటికింద గాయం కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.