ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో... భారత విద్యార్థుల భద్రత విషయమై, విద్యార్థుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకునేందుకు భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం. కృష్ణ బుధవారం రాత్రి సిడ్నీ చేరుకున్నారు. ఐదు రోజులపాటు ఇక్కడ పర్యటించనున్న ఆయన, సంబంధిత నేతలతో పలు విషయాలపై కూలంకషంగా చర్చించనున్నారు.