ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులను సహించలేకపోయిన ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణుడు... రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్ (ఆర్ఏఏఎఫ్) వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు ది ఏజ్ దినపత్రిక వెల్లడించింది. ఏకంగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికే ఇంటెర్నెట్ హెచ్చరిక సందేశాన్ని పంపించిన ఇతను.. తనపేరు అతుల్ ద్వివేదీ అని, తాను ఎయిర్‌ఫోర్స్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశానని పేర్కొనడం గమనార్హం.