ఇండో-అమెరికన్ నటుడు "పెన్న్‌"పై ఓ దొంగోడి జులుం..!!

Nri News
Ganesh|
FILE
ఇండియన్-అమెరికన్ నటుడు, కల్ పెన్న్‌పై ఓ దొంగోడు తుపాకీ గురిపెట్టి ఆయన వస్తువులను దొంగిలించుకుపోయాడు. కాగా.. అమెరికా శ్వేత భవనంలోని "ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ లైసన్"లో కల్ పెన్ విధులు నిర్వహిస్తుండటం గమనార్హం.

నటుడిగా పెన్న్ పేరుతో గుర్తింపు పొందిన ఈయన అసలు పేరు కల్‌పెన్ మోడీ. యూఎస్ కాపిటల్‌లోని డుపోంట్ సర్కిల్ ఏరియాలో ఉంటున్న మోడీని మంగళవారం ఒక దొంగోడు తుపాకీ గురిపెట్టి అతని వాచీ, సెల్‌ఫోన్ తదితర వస్తువులను దొంగిలించుకుపోయినట్లు తెలుస్తోంది.

మరోవైపు పెన్ దోపిడీకి గురైన సంగతి నిజమేనని ఆయనకు మాజీ పబ్లిసిస్ట్‌గా వ్యవహరించిన జెన్నీఫర్ గుడ్విన్ టీఎమ్‌జెడ్.కామ్‌కు ధృవీకరించినట్లు "ది చికాగో ట్రిబ్యూన్" కథనం ద్వారా తెలుస్తోంది. కాగా.. ఈ విషయమై పోలీసులు రంగంలోకి దిగి విచారించగా, ఆయుధాలు కలిగిన దుండగుడు పెన్న్‌ను బెదిరించి సెల్‌ఫోన్ తదితర వస్తువులను లాక్కెళ్లినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే.. "హరాల్డ్ అండ్ కుమార్ గో టు వైట్ కాస్ట్లే" అనే చిత్రంలో కుమార్ అనే పాత్రలో నటించిన పెన్న్.. ఫాక్స్ షో అయిన "హౌస్"లో ఓ ప్రధాన పాత్రను పోషించారు.


దీనిపై మరింత చదవండి :