పంజాబ్‌కు చెందిన రమేష్ కుమార్ అనే 27 సంవత్సరాల యువకుడు ఇటలీలోని మిలాన్ నగరంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 2007లో ఇటలీకి వలస వెళ్లిన కుమార్, మిలాన్ నగరంలోని టింబర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కాగా.. జూలై 28వ తేదీన అనుమానాస్పద రీతిలో స్థానిక నది ఒడ్డున శవమై కనిపించాడు. దీంతో తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశం తీసుకొచ్చేందుకు అతడి కుటుంబ సభ్యులు అక్కడి ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.