రసాయనశాస్త్రంలో 2009 సంవత్సరానికిగానూ నోబెల్ అవార్డును పొందిన భారత సంతతి శాస్త్రవేత్త వెంకట్రామన్ రామకృష్ణన్ (57).. భారత్ నుంచి వెల్లువలా వచ్చిపడుతున్న ఇ-మెయిల్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను అభినందిస్తూ భారతీయులు కుప్పలు తెప్పలుగా పంపుతున్న ఇ-మెయిల్స్‌తో తాను సతమతమవుతున్నట్లు ఆయన వాపోయారు.