ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇచ్చే ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు.. ఆ సంస్థ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ ఈదర లోకేశ్వరరావు ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థినీ విద్యార్థులు, అక్కడి నుంచే దరఖాస్తు చేయాలని ఆయన కోరారు. అమెరికాలో మాస్టర్స్‌తో పాటు గ్రాడ్యుయేషన్ కోర్సు చేసేందుకు వచ్చే విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలను అందజేస్తామని ఛైర్మన్ వివరించారు.