భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త అమిత్ గోయల్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ టెక్నాలజీ నెట్‌వర్క్ అవార్డుకు ఈయన ఎంపికయ్యారు. ఓక్ రిడ్జ్ నేషనల్ లేబరేటరీకి చెందిన భౌతిక శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న అమిత్‌కు, వరల్డ్ టెక్నాలజీ నెట్‌వర్క్స్‌కు చెందిన మెటీరియల్స్ అవార్డు తుది ఫైనలిస్టుల జాబితో చోటు దక్కింది.