యూకేలో అనుమానాస్పద స్థితిలో తన స్వగృహంలో మృతిచెంది ఉన్న భారత సంతతికి చెందిన లేబర్ పార్టీ ఎంపీ అశోక్ కుమార్ సేవలను బ్రిటీష్ పార్లమెంట్ కొనియాడింది. సహజ పోరాటయోధుడు, జాతి నాయకుడిగా పేరుగాంచిన ఓ శ్రద్ధాపూర్వక సభ్యుడిని సభ కోల్పోయిందని దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో అశోక్‌కు నివాళులు అర్పించింది.