ఎన్‌సీఐసీలో ఎన్నారై హెచ్ఎస్ ఆదేశ్

FILE
భారత సంతతికి చెందిన తత్త్వవేత్త, సంగీతకారుడు, విద్యావేత్త, మేధావి అయిన హెచ్ఎస్ ఆదేశ్ "ట్రినిడాడ్ అండ్ టోబాగో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కల్చర్"లో స్థానం లభించింది. దివాళి నగర్‌లోని పయనీర్ హాల్‌లో జరిగిన ఎన్‌సీఐసీ ఐదవ ప్రవేశ వార్షికోత్సవం మరియు 45 వార్షికోత్సవ కార్యక్రమంలో ఆదేశ్ ఈ గౌరవాన్ని పొందారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో హిందీ సాహిత్యం, భారత సంగీతం, తత్త్వశాస్త్రం, విద్య, సంస్కృతి, సామాజిక రంగాలకు ఆదేశ్ చేసిన జీవితకాల సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఇదిలా ఉంటే... భారతదేశంలోని జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఆదేశ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్)‌ సాంస్కృతిక అధికారిగా 1966లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు వలస వచ్చారు.

Ganesh|
పది సంవత్సరాలపాటు ఐసీసీఆర్ అధికారిగా పదేళ్లపాటు హెచ్ఎస్ ఆదేశ్ పనిచేశారు. అంతేగాకుండా భారతీయ విద్యా సంస్థాన్ (బీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్) అనే సంస్థను స్థాపించి, దానిని అనేక దేశాలకు విస్తరించిన ఘనత కూడా ఈయనదే కావడం గమనార్హం.


దీనిపై మరింత చదవండి :