అపర గాన గంధర్వుడు, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు... ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నట్లు, ఆ సంస్థ అధ్యక్షుడు జయరాం కోమటి వెల్లడించారు. జూలై 2 నుంచి 4వ తేదీ వరకు చికాగోలో జరుగనున్న తానా మహాసభల సందర్భంగా ఈ అవార్డును బాలూకు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.