ఏడుగురు ఎన్నారైలకు "గోపియో" అవార్డులు

Nri News
Ganesh|
FILE
గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (జీఓపీఐఓ-గోపియో) అవార్డులకు ఏడుగురు ప్రవాస భారతీయులు ఎంపికయ్యారు. తాము నివసిస్తున్న దేశంతోపాటు మాతృభూమి కోసం చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ ఏడుగురిని గోపియా అవార్డులు వరించాయి. కాగా.. వీరితోపాటు మరో ఇద్దరికి ప్రత్యేక పురస్కారాలను అందజేయనున్నారు.

కాగా.. నెదర్లాండ్స్‌కు చెందిన రాజెన్ రామనాథ్, మలేషియాకు చెందిన దాతుక్ వినోద్ శేఖర్, దుబాయ్‌కి చెందిన లక్ష్మణదాస్ పాగరాని, ప్రస్తుతం కేరళలో నివసిస్తున్న ప్రభాకర్, అమెరికాకు చెందిన రమేష్ గుప్తాలు.. ఈ గోపియా అవార్డులను అందుకున్నవారిలో ఉన్నారు. వీరితోపాటు అమెరికాకు చెందిన డాక్టర్ జగత్ మోత్వానీ, దుబాయ్‌కి చెందిన ఇసాక్ జాన్‌లు ప్రత్యేక పురస్కారాలను అందుకోనున్నారు.

ఈ సందర్భంగా జీఓపీఐఓ అంతర్జాతీయ అధ్యక్షుడు లార్డ్ దల్జిత్ రాణా మాట్లాడుతూ.. ఈ ఏడుగురు ప్రవాస భారతీయులు చేసిన సేవలను ఈ అవార్డులు ప్రతిబింబిస్తాయనీ, ఇలాంటివారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 6వ తేదీన జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం జరుగుతుందని జీఓపీఐఓ ఛైర్మన్ ఇందర్ సింగ్ పేర్కొన్నారు. భారత ఎన్నారైల వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు.


దీనిపై మరింత చదవండి :