ఏది ఏమయినా పార్టీతోనే ఉంటా : పాల్

FILE
బ్రిటన్‌లో అధికార లేబర్ పార్టీకి తన మద్ధతు కొనసాగుతుందని ఎన్నారై లార్డ్ స్వరాజ్ పాల్ స్పష్టం చేశారు. ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత బిల్లుకు తమ పార్టీ మద్ధతు పలికినా తనకు అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు.

కాగా... బ్రిటన్‌లో శాశ్వత నివాసం లేనివారు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధించాలంటూ ఈ బిల్లులో ప్రతిపాదించిన సంగతి విదితమే...! ఈ విషయమై పాల్ మాట్లాడుతూ... ఈ బిల్లుకు లేబర్ పార్టీ మద్ధతుపలికినా, ఏది ఏమయినా తాను ఆ పార్టీతోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.

గోర్డాన్ బ్రౌన్ సన్నిహితుడిగా పేరుపొందిన పాల్... బ్రౌన్ బెస్ట్ ప్రధాని అనడంలో తనకు ఎలాంటి సందేహమూ లేదని ఈ సందర్భంగా అన్నారు. బ్రిటన్‌లో లేబర్ పార్టీ ఉత్తమమైన పార్టీ అనీ, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే సత్తా బ్రౌన్‌కు మాత్రమే ఉందని ఆయన ప్రశంసించారు.

Ganesh|
ఇదిలా ఉంటే... బ్రిటన్ పార్లమెంట్‌కు ప్రతిపాదించిన పై బిల్లుపట్ల స్వరాజ్ పాల్ అసంతృప్తిగా ఉన్నారంటూ బ్రిటన్ దినపత్రికలు కోడైకూశాయి. దీంతో మేలుకున్న పాల్ పై విధంగా వివరణ ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా స్వరాజ్ పాల్ లేబర్ పార్టీకి నిధులు అందిస్తున్న సంగతి తెలిసిందే...!!


దీనిపై మరింత చదవండి :