ఇప్పటికే ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులతో భారతీయులు సతమతమవుతుండగా.. మరోవైపు ఉత్తర ఐర్లాండ్‌కు కూడా ఈ సంస్కృతి వ్యాపించినట్లు అర్థమవుతోంది. ఈ దేశంలోని పోర్టాడౌన్ అనే నగరంలో నివసిస్తున్న రెండు భారతీయ కుటుంబాలపై జాత్యహంకార దాడులు జరగటాన్ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పైగా ఈ రెండు కుటుంబాలూ మలయాళీలవే కావడం గమనార్హం.