అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా యంత్రాంగంలో మరో ప్రవాస భారతీయుడికి కీలక పదవి లభించింది. క్లింటన్ ఫౌండేషన్‌కు ప్రత్యేక సలహాదారుగా సేవలందించిన భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు సురేష్ కుమార్‌కు.. వాణిజ్యశాఖ అదనపు కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫారిన్ కమర్షియల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్‌గా కూడా నియమిస్తూ ఒబామా ఉత్తర్వులు జారీ చేశారు.