కాంగ్రెస్ పార్టీకి తెలుగు కళాసమితి అభినందన

Ganesh|
ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీకి... యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్‌లోని "తెలుగు లలిత కళాసమితి" అభినందనలు తెలియజేసింది. శాసనసభ, లోక్‌సభలలో అడుగుపెడుతున్న నూతన ప్రజా ప్రతినిధులకు యూఏఈలోని తెలుగువారందరి తరపున సమితి ఈ సందర్భంగా శుభాకాంక్షలను తెలిపింది.

అలాగే... శాసనసభలో అడుగు పెట్టబోతున్నప్రజా ప్రతినిధులకు, పాలక పక్షానికి ఈ సందర్భంగా తెలుగు లలిత కళా సమితి కొన్ని విన్నపాలను తెలిపింది. అవేంటంటే... గల్ఫ్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు, సామాజిక స్పృహ కలిగిన సమర్థుడైన నాయకుడిని అధికార ప్రతినిధిగా నియమించి, నిరంతర పర్యవేక్షణ చేయించటం.

ఇంకా... రాష్ట్రానికి తిరిగివచ్చిన ప్రవాసాంధ్రులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి, మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించటం, సంయుక్త ఆరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న యావత్తు తెలుగు వారందరినీ సంఘటిత పరిచేందుకు ఓ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం... తదితర సూచనలను కొత్త ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని తెలుగు కళాకమితి ఆశాభావం వ్యక్తం చేసింది.


దీనిపై మరింత చదవండి :