కృష్ణశాస్త్రి జన్మదినం సందర్భంగా ప్రసంగ గోష్ఠి

Ganesh|
ప్రముఖ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి 113వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తులతో ప్రసంగ గోష్ఠిని నిర్వహించనున్నట్లు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఒక ప్రకటనలో తెలియజేసింది. "నెలనెలా తెలుగు వెన్నెల" 21వ కార్యక్రమంగా జరిగే ఈ ప్రసంగ గోష్ఠిని వంగూరి ఫౌండేషన్, త్యాగరాయ గానసభలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

కాగా.. హైదరాబాద్‌ నగరంలోని త్యాగరాయ గానసభలో నవంబర్ 8వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో దేవులపల్లితో ప్రత్యక్ష పరిచయం ఉన్న పాలగుమ్మి విశ్వనాథం, డాక్టర్ నిడమర్తి నిర్మలాదేవి, తురగా జానకీరాణి, పచ్చిపులుసు వెంకటేశ్వర్లు.. తదితరులు హాజరై తమ అనుభవాలను పంచుకోనున్నారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషన్ డాక్టర్ సి. నారాయణరెడ్డి హాజరు కానున్నారు. శిరోమణి వంశీ రామరాజు అధ్యక్షత వహించే ఈ సభలో అధ్యక్షుడు కళా వేంకట దీక్షితులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేయనున్నారు.


దీనిపై మరింత చదవండి :