భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు... కెనడా, ఎక్స్ప్రెస్ బిజినెస్ వీసాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. కొత్తగా ప్రకటించిన సరళీకృత వీసా విధానం కింద దరఖాస్తు చేసుకున్న 24 గంటల వ్యవధిలోనే భారతీయ వ్యాపారులకు వీసాలను మంజూరు చేసే దిశగా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.