కోలాహలంగా సాగిన "టాస్క్" స్టార్‌నైట్

FILE
తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టాస్క్) నిర్వహించిన స్టార్‌నైట్ సాంస్కృతిక కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కాలిఫోర్నియాలోని ప్రవాస తెలుగువారినందరినీ ఉర్రూతలూగించిన ఈ కార్యక్రమం లా మేరిడా థియేటర్‌లో జరిగింది. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత, నృత్య, హాస్య కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

ప్రముఖ టీవీ యాంకర్లు సుమ, ఝాన్సీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ స్టార్‌నైట్ కార్యక్రమంలో రాజీవ్ కనకాల, రఘుబాబు, ఉత్తేజ్, మహర్షిలతో సుమ, ఝాన్సీలు చేసిన హాస్య కార్యక్రమం నవ్వు పువ్వులు పూయించింది. ఇక గాయకులు మనో, సునీత పాడిన పాటలు, హీరోయిన్ నవనీత్‌కౌర్ డ్యాన్సులు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

Ganesh|
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, తానా అధ్యక్షుడు కోమటి జయరామ్, సీఎమ్ రమేష్, ధరమ్‌రెడ్డి గుమ్మడి తదితరులను పాటు టాస్క్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఉషగొర్తి, ఉపాధ్యక్షులు భారతి పెన్నిటి, కార్యదర్శి శ్రీకాంత్ కోమటిరెడ్డి, కోశాధికారి మురళీ వెంకటరమణ రెడ్డిలు ఈ సందర్భంగా సన్మానించారు.


దీనిపై మరింత చదవండి :