భారత దౌత్యవేత్త, స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికి మూల కథ అయిన క్యూ అండ్ ఏ నవలా రచయిత అయిన వికాస్ స్వరూప్‌ను యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) సత్కరించనుంది. జూన్ 17న జరుగనున్న యూఎస్ఐబీసీ 34వ వార్షికోత్సవంలో ఆయన ఈ సత్కారాన్ని అందుకోనున్నారు. ఇదే సందర్భంగా వికాస్ సాంస్కృతిక సంబంధాల అవార్డును కూడా స్వీకరించనున్నారు.