ఘనంగా ముగిసిన ఘంటసాల ఆరాధనోత్సవాలు

FILE
అమెరికాలోని 30 ప్రధాన నగరాలలో స్వర్గీయ ఆరాధనోత్సవాలు దిగ్విజయంగా ముగిసినట్లు... ప్రముఖ సేవా సంస్థ వేగేశ్న ఫౌండేషన్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థలు వెల్లడించాయి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల మే 10వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు జరిగాయి.

ఈ విషయమై వేగేశ్న ఫౌండేషన్ కమిటీ సభ్యుడు వంశీ కె. ధర్మారావు హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో మాట్లాడుతూ... ఘంటసాల ఆరాధనోత్సవాలు అమెరికాలోని హ్యూస్టన్, ఇండియానా, న్యూజెర్సీ, న్యూయార్క్, బోస్టన్, చికాగో, డెట్రాయిట్ లాంటి 30 నగరాలలో ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Ganesh|
జంట నగరాలకు చెందిన ప్రముఖ గాయకులు చంద్రతేజ, విజయలక్ష్మిలు ఘంటసాల ఆలాపించిన, బహుళ ప్రాచుర్యం పొందిన పాటలను పాడి.. అమెరికాలోని తెలుగు శ్రోతలను మంత్రముగ్దులను చేశారని వంశీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షార్లెట్ నగర మేయర్ ఆరాధనోత్సవాల నిర్వాహకులైన వంశీ రామరాజు, డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజులతో పాటుగా.. గాయనీ, గాయకులను ఘనంగా సత్కరించారని ఆయన వివరించారు.


దీనిపై మరింత చదవండి :