చట్టబద్ధంగా ఎంతమందైనా రావచ్చు : టోస్కానో

nri news
Ganesh|
FILE
చట్టబద్ధంగా భారతీయులు ఎంతమందైనా ఇటలీకి రావచ్చునని.. భారత ఇటలీ రాయబారి రాబర్ట్ టోస్కానో ప్రకటించారు. అయితే ఇటలీలో భారత అక్రమ వలసదారులు చాలామందే ఉన్నారనీ, వారు చట్టబద్ధంగా నివసించే భారత ప్రవాసుల్లో సగానికి పైగానే ఉంటారన్నారు.

ఈ విషయమై టోస్కానో మాట్లాడుతూ.. పెట్టుబడులు, వస్తువుల దిగుమతిలాగానే ఇటలీ అభివృద్ధికి వలస ప్రజలు ముఖ్యమని తాము భావిస్తున్నామని చెప్పారు. భారత వలసదారులు ఇటలీ అభివృద్ఘికి ఎంతగానో చేయూతనిస్తున్నారనీ, అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.

చట్టబద్ధంగా ఇటలీలో 77 వేల మంది భారతీయులు నివాసం ఉంటున్నారనీ, ఇందులో ఎక్కువమంది పంజాబ్ రాష్ట్రానికి చెందినవారేనని టోస్కానో వివరించారు. అయితే ఇటలీలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందనీ, అలాంటివారు దాదాపు 40 వేల మందిదాకా ఉంటారని చెప్పారు.

పంజాబ్ సిక్కులు తమ సమాజంగో భాగమయ్యారనీ, రోడ్లమీద సైకిల్ నడుపుతూ వెళుతున్నప్పుడు వారిని ప్రత్యేకంగా తాము చూడబోమనీ, తమలో ఒకరిగా భావిస్తామని టోస్కానో పేర్కొన్నారు. ఇటలీలోని భారతీయ ప్రవాసుల, ముఖ్యంగా సిక్కుల విజయగాథలు చాలానే ఉన్నాయని ఆయన తెలియజేశారు.


దీనిపై మరింత చదవండి :