పాకిస్థాన్‌లో జన్మించిన విదేశీ జాతీయులకు ప్రవేశపెట్టిన కొత్త వీసా నిబంధనలవల్ల భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని.. న్యూయార్క్‌లోని ఇండియన్ అమెరికన్ సంస్థ ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను పునఃపరిశీలించాలంటూ ఆ సంస్థ భారత హోంశాఖా మంత్రి పి. చిదంబరంకు విజ్ఞప్తి చేసింది.