అవినీతికి వ్యతిరేఖంగా జనలోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని అన్నాహజారే చేపట్టిన దీక్షకు మద్దతుగా గతవారం హౌస్టన్‌లో ఫిఫ్త్ పిల్లర్ సంస్థకు చెందిన తెలుగు ఎన్నారైలు ఒకరోజు దీక్ష చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిమాణాల తరువాత ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఫిఫ్త్ పిల్లర్ హౌస్టన్ శాఖా అధ్యక్షడు రాఘవ సోలిపురం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే తప్పకుండా ప్రజల జీవితల్లో వెలుగులు చూడవచ్చని దానికి నిదర్శనంగా ఈ కొవ్వొత్తులతో సంఘీభావ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. మంగళవారం University of Houstonలో జరిగిన సంతకాల సేకరణలో భాగంగా దాదాపు ౩౦౦ మంది విద్యార్థులు Lokpal Billను పటిష్టపరచడానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.