"జన హృదయ నేత"కు టాన్‌టెక్స్ అశ్రు నివాళి

YSR
Ganesh|
FILE
బడుగు, బలహీనవర్గాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్‌టెక్స్) ఘనంగా నివాళులు అర్పించింది. ఆయన మృతి తమను తీవ్రంగా కలచి వేసిందని, ఆయన మరణం రాష్ట్రానికి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువారికందరికీ తీరని లోటని టాన్‌టెక్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర పురోగతికి నిర్విరామంగా కృషి చేసిన వైఎస్సార్ సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా టాన్‌టెక్స్ కొనియాడింది. జన హృదయ నేత వైఎస్సార్ మృతికి టాన్‌టెక్స్ బోర్డు టస్ట్రీస్, అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ సభ్యుల తరపున తమ సంతాపాన్ని వెల్లడించారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన టాన్‌టెక్స్.. అమరనేత ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించింది.

మరోవైపు.. హెలికాప్టర్ ప్రమాదంలో డైనమిక్ నేత అయిన వైఎస్సార్ మరణించటం అత్యంత విషాదకరమైన సంఘటన అని మెగాస్టార్ చిరంజీవి యూకే అసోసియేషన్ (ఎంసీయూకే) పేర్కొంది. వైఎస్ మృతికి తమ సంతాపాన్ని తెలుపుతూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.


దీనిపై మరింత చదవండి :