జాతి విద్వేషం కేసులో కొరియన్‌కు జరిమానా

Racial Attacks
Ganesh|
FILE
భారత పరిశోధకుడిపై జాతి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన నేరానికిగానూ దక్షిణ కొరియా జాతీయుడికి సియోల్‌లోని స్థానిక కోర్టు భారీ జరిమానాను విధించింది. భారతీయ పరిశోధకుడు హుస్సేన్‌పై అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ పార్క్ అనే 31 సంవత్సరాల కొరియన్ యువకుడి ఇంచియాన్ జిల్లా కోర్టు 1 మిలియన్‌వాన్‌ (865 అమెరికన్ డాలర్లు)ల జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. ఒక భారతీయుడిపై జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కొరియావాసికి శిక్ష పడటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఈ సంవత్సరం జూన్ నెలలో చోటు చేసుకున్న ఈ ఘటన మీడియా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ ఘటనలో హుస్సేన్‌ను దుర్వాసన కొట్టుకుంటూ, మురికిగా ఉన్నావంటూ పార్క్ విద్వేష వ్యాఖ్యలు చేశాడు.

ఇదిలా ఉంటే... ఈ ఘటన నేపథ్యంలో పలువురు మానవహక్కుల కార్యకర్తలు తీవ్రంగా స్పందిచారు. అంతేగాకుండా విదేశీయులపై జాతివిద్వేషానికి పాల్పడేవారికి వ్యతిరేకంగా ఒక బిల్‌ను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారని సియోల్‌లోని యోన్‌హ్యా‌ప్ వార్తాసంస్థ పేర్కొంది.


దీనిపై మరింత చదవండి :