తనేంతిరాన్‌కు మక్కల్ శక్తి పార్టీ బహిష్కరణ

Ganesh|
మలేషియాలో కొత్తగా ఏర్పాటయిన భారతీయ పార్టీ మక్కల్ శక్తి పార్టీలో సంక్షోభం తలెత్తింది. ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆర్ఎస్ తనేంతిరాన్‌ను, కేంద్రకమిటీ బహిష్కరించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. జనవరి 17వ తేదీ తరువాత ఇది అమల్లోకి వస్తుందనీ, ప్రస్తుతం 13మందితో ఉన్న ఆ పార్టీ కేంద్రకమిటీ సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. మక్కల్ శక్తి కేంద్రకమిటీ సమావేశానికి హాజరుకాలేకపోయిన ఇతర కేంద్రకమిటీ సభ్యులు తనేంతిరాన్ తొలగింపుకు మద్ధతుగా లేఖలు పంపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఎ. వేదమూర్తి మాట్లాడుతూ... అధ్యక్ష పదవినుంచి దిగిపోయి సలహాదారుగా బాధ్యతలు చేపట్టాలని రెండుసార్లు అభ్యర్థించినా తనేంతిరాన్ స్పందించలేదని వివరించారు.

మెజారిటీ సభ్యుల అభీష్టాన్ని ధిక్కరించిన తనెంతిరాన్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసి, పార్టీ నుంచి బహిష్కరించటం మినహా కేంద్రకమిటీకి వేరే ప్రత్యామ్నాయం లేకపోయిందని ఈ సందర్భంగా వేదమూర్తి వివరించారు. కాగా.. తనను బయటికి గెంటేస్తే పార్టీని నాశనం చేస్తానని తనెంతిరాన్ బెదిరించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్. కన్నన్ ఆరోపించటం గమనార్హం.


దీనిపై మరింత చదవండి :