తానా ఉపాధ్యక్షుడిగా మధుసూధన్

Ganesh|
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కెనడా ప్రాంతీయ ఉపాధ్యక్షుడిగా మధుసూధన్ చిగురుపాటిని ఎంపిక చేసినట్లు.. ఆ సంస్థ ప్రకటించింది. కాగా... కెనడాలో నివాసం ఉండే వారి కోసం, కొత్తగా ఈ ప్రాంతీయ అధికారి పదవిని నియమించినట్లు తానా వెల్లడించింది.

ఇదిలా ఉంటే... మధుసూధన్ అనేక సాంఘిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనటమే గాకుండా, టొరంటోలోని తెలుగు లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా, కెనడియన్ చాప్టర్ ఆఫ్ డయాబెటీస్ అసోసియేషన్ సభ్యుడిగా, టొరంటో కల్చరల్ అసోసియేషన్ మెంబర్‌గా పలు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

అంతేగాకుండా... హురియన్ కాలేజ్ ఆఫ్ మేనేజిమెంట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా... ఆ సంస్థకు డైరెక్టర్‌గా కూడా మధుసూధన్ చిగురుపాటి పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మధుసూధన్ మాట్లాడుతూ... అమెరికాలోని తెలుగు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.


దీనిపై మరింత చదవండి :