అమెరికాలోని పేద విద్యార్థుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రవేశపెట్టిన బ్యాక్ ప్యాక్ పథకంపై వోర్సెస్టర్ మేయర్ కాన్ట్సాంటిన లూక్స్ హర్షం వ్యక్తం చేశారు. వోర్సెస్టర్లో నిర్వహించిన బ్యాక్ ప్యాక్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లూక్స్.. తానా సేవలను కొనియాడారు.