అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రుడు కిషోర్ కుంచంకు.. న్యూయార్క్ రాష్ట్రం లాంగ్ ఐలాండ్‌లోని ఫ్రీపోర్ట్ పాఠశాలల సూపరింటెండెంట్‌గా అరుదైన గౌరవం దక్కింది. కాగా.. ప్రతిష్టాత్మకమైన ఈ బాధ్యతను చేపట్టిన తొలి ఇండో-అమెరికన్‌గా కిషోర్ రికార్డు సృష్టించారని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఒక ప్రకటనలో వెల్లడించింది.