దక్షిణాఫ్రికాలో దొంగల దాడి : ఎన్నారై మృతి

Ganesh|
FILE
దక్షిణాఫ్రికా దేశంలో స్థిరపడిన భారతీయ వ్యాపారి ఒకరు దోపిడీ దొంగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రిటోరియాలోని లాడియం ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వ్యాపారి ఇంటి పనిమనిషి సహకరించి గేటు తీయటంతో ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొచ్చుకుని వచ్చినట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఇంటి యజమానులైన ఫైజల్ జూసబ్, ఆయన సోదరుడు యూసుఫ్ జూసబ్‌లను రివాల్వర్లతో బెదిరించి డబ్బును దోచుకున్నారు.

ఈ క్రమంలో యూసుఫ్ జూసబ్ పొట్టలో కాల్చిన దుండగులు అందినకాడికల్లా దోచుకుని ఉడాయించారు. అయితే సత్వరకాలంలో వైద్య సహాయం అందని కారణంగా యూసుఫ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారని పోలీసులు వెల్లడించారు. కాగా... దుండగులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు వారు తెలిపారు.


దీనిపై మరింత చదవండి :