దక్షిణాఫ్రికా దాడి : గాయపడ్డ కిరణ్ మృతి

FILE
దక్షిణాఫ్రికాలో దుండగుల చేతిలో కాల్పులకు గురై తీవ్రంగా గాయపడిన ఆంధ్రా యువకుడు కిరణ్ మంగళవారం మరణించాడు. జోహెన్స్‌బర్గ్‌లో గత రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఇతనిపై గుర్తు తెలియని యువకులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో బుల్లెట్లు కడుపులోకి దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన కిరణ్‌ను, అతడి స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించారు.

తదనంతరం వరంగల్ జిల్లా ఆరెపల్లిలో నివసిస్తున్న కిరణ్ కుటుంబ సభ్యులకు అతని స్నేహితులు... కిరణ్‌పై జరిగిన దాడి సమాచారాన్ని ఫోన్‌లో తెలియజేశారు. అయితే చికిత్స పొందుతున్న కిరణ్ పరిస్థితి విషమంగా మారడంతో అతను మంగళవారం మృతి చెందాడు.

Ganesh|
ఇదిలా ఉంటే... వరంగల్ జిల్లా ఎస్పీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ కిరణ్ కుటుంబ సభ్యులు సాధ్యమైనంత త్వరగా దక్షిణాఫ్రికా వెళ్ళేందుకు వీసాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా... వేరే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన కిరణ్‌ను, ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న నీవు మళ్లీ మాకెందుకు పోటీగా వచ్చావని నిలదీస్తూ.. ఒక భారతీయుడు, మరో ముగ్గురు దక్షిణాఫ్రికా యువకులు కలిసి దాడికి దిగిన సంగతి విదితమే...!


దీనిపై మరింత చదవండి :