దక్షిణాఫ్రికా రోడ్డు ప్రమాదం : ఆంధ్రుడి మృతి

Ganesh|
దక్షిణాఫ్రికాలో కార్లో వెళుతున్న హైదరాబాద్‌కు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో భర్త చికిత్స పొందుతూ మృతి చెందగా.. భార్య అపస్మారక స్థితిలో చికిత్స పొందుతోంది.

వివరాల్లోకి వెళ్తే... నగరంలోని ఎల్‌బీ నగర్‌లోని టెలిఫోన్ కాలనీకి చెందిన శేషగిరిరావు కుమారుడు అనీని కుంజ్ (32) తన భార్య (30)తో కలిసి రెండేళ్లనుంచి దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నారు. వీరిద్దరూ కార్లో వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు అక్కడి పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులు సమాచారం అందుకున్నారు. దీంతో హుటాహుటిన వారు దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లారు.


దీనిపై మరింత చదవండి :