ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులపై జరుగుతున్న దాడుల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా... ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు భారత్‌లోని న్యూఢిల్లీలో గల ఆ దేశ రాయబారి జాన్ మెక్‌కార్తి ఓ లేఖను రాసిన వైఎస్సార్... రాష్ట్రానికి చెందిన చాలామందిపై దాడులు జరిగాయని అందులో వివరించారు.