భారతీయులపై తమ దేశంలో జరిగిన దాడులు గర్హనీయమని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కెవిన్ రూడ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడిన ఆయన... దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వరుసగా భారతీయులపై జరుగుతున్న దాడుల గురించి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్తో తాను మాట్లాడానని రూడ్ వెల్లడించారు. దాడులను ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మన్మోహన్ తనను ఫోన్లో కోరారని... దాడుల విషయంపై ప్రభుత్వం కూడా చర్చిస్తోందని, త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని రూడ్ తెలిపారు.