దాడుల వివరాలు భారత్‌కు అందిస్తాం : విక్టోరియా

Racial Attacks
Ganesh|
FILE
ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల వివరాలను భారతదేశానికి అందజేస్తామని విక్టోరియా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల భారతదేశంలో పర్యటించిన విక్టోరియా ప్రధానమంత్రి జాన్ బ్రంబీ ఈ మేరకు న్యూఢిల్లీలో ఈ ప్రతిపాదన చేశారని ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

విక్టోరియా ప్రాంతంలో ఇప్పటిదాకా భారతీయులపై జరిగిన దాడులు, వాటికి సంబంధించి నమోదైన కేసులు, దర్యాప్తులో పురోగతి తదితర అంశాలను పూర్తి వివరాలతో సహా అందిస్తామని భారత ప్రభుత్వానికి బ్రంబీ హామీ ఇచ్చారని .. విక్టోరియా ప్రతినిధి స్థానిక వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వీటి ద్వారా దాడులకు సంబంధించిన కేసుల పురోగతి తదితర అంశాలను ఈ వివరాల ద్వారా తెలుసుకునే అవకాసం ఉంటుందని ఆ ప్రతినిధి వివరించారు.

ఇదిలా ఉంటే.. దాడుల నేపథ్యంలో ఆసీస్-భారత్‌ల నడుమ దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకునే క్రమంలో ఇటీవల భారత్‌లో పర్యటించిన బ్రంబీ.. తిరిగీ విక్టోరియాకు చేరుకున్న తరువాత ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా.. గత నెలలో బ్రంబీ వారంరోజులపాటు భారతదేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దాడుల నివారణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే బ్రంబీ తిరిగి వెళ్లిన కొన్నిరోజుల్లోనే భారతీయులపై దాడులు మళ్లీ యధాతథంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే..!


దీనిపై మరింత చదవండి :