విదేశాలలో నివశిస్తున్న ప్రవాస భారతీయుల కోసం భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల బిల్లుపై రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో చర్చ జరుగనుంది. విదేశాలలో నివశిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులకు ఓటు వేసే హక్కును కల్పించాలంటూ ఆగస్టు, 2010లో రాజ్యసభలో ఓ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.