ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలంటూ.. హెచ్‌ఎస్‌ఎమ్‌పీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఓ బహిరంగ లేఖను రాసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించటం ద్వారా మాతృదేశంతో సంబంధాలు కొనసాగించేలా చూడాలని బ్రిటన్‌లోని పలు వలస జాతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత ప్రతిభ కలిగిన వలస వృత్తి నిపుణుల సంఘం (హెచ్‌ఎస్‌ఎమ్‌పీ) ఈ లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేసింది.